MLA Quota MLC Elections: ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2023-03-06T19:05:44+05:30 IST

రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections)కు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది....

MLA Quota MLC Elections: ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌

అమరావతి: రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections)కు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల, మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా కమిషన్‌ పేర్కొంది. మార్చి 23వ తేదీన పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్‌, చల్లా భగీరథరెడ్డి (Nara Lokesh Challa Bhagirath Reddy), పోతుల సునీత, బచ్చుల అర్జు నుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది.

మరోవైపు అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, అనంతపురం, కడప, నెల్లూరు (Anantapur Kadapa Nellore), చిత్తూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో 4(పశ్చిమగోదావరిలో రెండు స్థానాలు, శ్రీకాకు ళం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు పోటీగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో పి.రామసుబ్బారెడ్డి(వైసీపీ) ఏక గ్రీవం అయ్యారు. అలాగే, ఉమ్మడి తూర్పుగోదావరి జి ల్లా స్థానిక సంస్థల కోటాలో కుడుపూడి సూర్యనారాయణ(వైసీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో పోటీ..

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 22 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 49 మంది, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం గ్రాడ్యుయేట్‌ స్థానానికి 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. స్థానిక సంస్థల కోటాలో 4 స్థానాలు, 3 పట్టభద్రుల కోటా, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో మార్చి 13వ తేదీన వాటికి ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2023-03-06T19:05:44+05:30 IST