Chandrababu arrest: ఉత్కంఠకు తెర.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

ABN , First Publish Date - 2023-09-10T18:53:13+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill development case) మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ (Chandrababu arrest) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బ‌ృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బ‌ృందం సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు. $

Chandrababu arrest: ఉత్కంఠకు తెర.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill development case) మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ (Chandrababu arrest) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బ‌ృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బ‌ృందం సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు. చంద్రబాబుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబును రాజమండి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ప్రస్తుతం ఏసీబీ కోర్ట్ నుంచి సిట్ ఆఫీస్‌కు చంద్రబాబును తరలిస్తున్నారు.

రిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు లాయర్లు మరికాసేపట్లో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలావుండగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. రూ.271 కోట్ల స్కామ్‌ జరిగిందని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. కాగా.. అరెస్ట్ విషయంలో సుమారు 8 గంటలపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం చంద్రబాబుకు జుడీషియల్ రిమాండ్ విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు నిరుత్సాహానికి గురవుతున్నారు.


Untitled-12.jpg

అన్ని మండలాల్లో 144 సెక్షన్..

చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధింపు.. రాజమండి జైలుకు తరలింపు నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి మండలంలో 144 సెక్షన్ అమలు చేయాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అనుమతి లేకుండా ఏలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబును జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో విజయవాడ నుంచి రాజమండ్రి వరకు అన్ని మార్గాన్ని పోలీసులు క్లియర్ చేశారు. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దారి వెంబడి పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

Updated Date - 2023-09-10T19:14:45+05:30 IST