Chandrababu bail: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. కస్టడీ పిటిషన్‌పై హోరాహోరి వాదనలు..
ABN , First Publish Date - 2023-10-06T12:50:15+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మూడో విచారణ జరుగుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తవ్వగా ప్రస్తుతం కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరగుతున్నాయి.
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మూడో విచారణ జరుగుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తవ్వగా ప్రస్తుతం కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరగుతున్నాయి. సీఐడీ తరుపున న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. పొన్నవోలు వాదనలకు కౌంటర్‌గా చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు ప్రారంభించారు.
కస్టడీ పిటిషన్‌పై ఇరువురు న్యాయవాదుల హోరాహోరీగా వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఆయన బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాలని పొన్నవోలు సుధాకర్ కోరారు. ఇప్పటికే ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకున్నామని, సీఐడీ అధికారులు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. వాటిలో చంద్రబాబు పాత్ర, ఇతరులకు డబ్బు పంపిణీ అంశాలపై విచారణ చేయాలని అన్నారు. అందుకే ఐదు రోజుల కస్టడీ కోరుతున్నామని పొన్నవోలు అన్నారు.
దూబే తీవ్ర అభ్యంతరం..
కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజీ వాదనలపై చంద్రబాబు తరుపు న్యాయవాది దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీకి కోరడం పసలేని వాదనలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారని, విచారణలో చంద్రబాబు సహకరించారని కోర్టుకు వివరించారు. కస్టడీ ముగిసినా ఇప్పటివరకు కేసు డైరీ సమర్పించలేదని న్యాయవాది దూబే వాదించారు. దీంతో కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు.