ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకున్నది టీడీపీనే: అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Dec 14 , 2023 | 06:53 PM
ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాల ఆదుకుంది తెలుగుదేశం పార్టీనే అని (TDP AP President Achchennaidu) ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ...
అమరావతి: ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాల ఆదుకుంది తెలుగుదేశం పార్టీనే అని (TDP AP President Achchennaidu) ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం భూమి కేటాయించడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఉద్దానంలో రూ.1,900 కోట్ల వ్యయంతో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. టీడీపీ హయాంలో 6 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేస్తే.. వాటిని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. ఏడాదిలోగా పూర్తికావాల్సిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. నాలుగేళ్లు దాటుతున్నా అసంపూర్తిగా ఉందన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేవలం ఎన్నికల కోసం ప్రారంభోత్సవ నాటకం ఆడారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ విషయంలో అంతా తానే పూర్తిచేసినట్లు జగన్ అసత్యాలు చెబుతున్నారని తెలిపారు. సురక్షితమైన తాగునీరు ఇచ్చేందుకు టీడీపీ హయాంలో 175 ప్లాంట్లను ఏర్పాటు చేశారని, వాటిని కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రూ.700 కోట్ల విలువైన సుజలధార ప్రాజెక్టుకు మొత్తం నిధులు తమ ప్రభుత్వమే వ్యయం చేసినట్టు జగన్ రెడ్డి కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్దానం కిడ్నీ రోగులకు సరైన వైద్యం అందడం లేదన్నారు. వైద్యు కొరత ఉండడంతో పాటూ మందులు కూడా అరకొరగా అందిస్తున్నారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఎన్నికల స్టంట్లు చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారని అచ్చెన్నాయుడు తెలిపారు.