Anantapuram Dist.: ప్రభుత్వ విప్ కాపు వర్సస్ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

ABN , First Publish Date - 2023-04-20T15:34:08+05:30 IST

రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం, ఎన్. హనుమాపురంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఒకరిపై ఒకరు విమర్ళలు చేసుకుంటున్నారు.

Anantapuram Dist.: ప్రభుత్వ విప్ కాపు వర్సస్ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం, ఎన్. హనుమాపురంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఒకరిపై ఒకరు విమర్ళలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విసిరిన సవాలును మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు స్వీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం కనేకల్లు మండలం హనుమాపురంలో చర్చకు రావాలని నిన్న కాపు రామచంద్రారెడ్డి సవాలు విసిరారు.

చర్చకు సిద్ధపడి ఇప్పటికే కాలవ శ్రీనివాసులు హనుమాపురం చేరుకున్నారు. కాపు రామచంద్రారెడ్డితో చర్చ కోసం హనుమాపురంలో ఎదురుచూస్తున్నారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీనివాసులు, పోలీస్ బలగాలు చేరుకున్నాయి. కాగా కాలవ- కాపు మధ్య చర్చపై కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల వాహనానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది.

Updated Date - 2023-04-20T15:38:01+05:30 IST