LokeshYuvaGalam: 49వ రోజుకు లోకేష్ పాదయాత్ర... నేటి షెడ్యూల్ ఇదే
ABN , First Publish Date - 2023-03-21T10:01:59+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది.
శ్రీసత్యసాయిజిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) కొనసాగుతోంది. ఇప్పటి వరకు యువనేత 612.5 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈరోజు దాదాపు 9.8 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. 49వ రోజు పాదయాత్ర కదిరి ఆర్డీఓ కార్యాలయం సమీపాన విడిది కేంద్రం నుంచి మొదలవనుంది.
లోకేష్‌ను కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీలు..
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన రాంగోపాల్ రెడ్డి (Ramgopalreddy), కంచర్ల శ్రీకాంత్ (Kancharla Srikanth), వేపాడ చిరంజీవి రావు (Vepada Chiranjeevi Rao) ఈరోజు ఉదయం కదిరి ఆర్డీవో కార్యాలయం వద్ద లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సదర్భంగా ముగ్గురు ఎమ్మెల్సీలకు లోకేష్ శాలువా కప్పి సన్మానించారు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలంటూ అభివర్ణించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా సైకో పాలనపై తమరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా సమస్యలపై మండలిలో గళం వినిపించాలి అన్న అని కోరారు. ‘‘మాపై ముందు నమ్మకం పెట్టుకొని సీటు ఇచ్చిన మీకే మా గెలుపును అంకితం చేస్తున్నాం అన్న కంచర్ల శ్రీకాంత్, రాం గోపాల్ రెడ్డి. 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మీ డైరక్షన్‌లో పనిచేస్తాం’’ అని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.
సెల్ఫీవిత్ లోకేష్...
కదిరి ఆర్డీవో కార్యాలయం విడిది కేంద్రం వద్ద సెల్ఫీవిత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా ప్రతీరోజూ సుమారుగా వెయ్యి మందికి సెల్ఫీ ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్నారు. లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నేటి లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే...
ఉదయం
ముత్యాలమ్మ చెరువులో టిడ్కో గృహాల పరిశీలన, లబ్ధిదారులతో భేటీ.
ఆలీపూర్ తండా వద్ద స్థానికులతో మాటామంతీ.
ముత్యాలమ్మ చెరువు వద్ద స్థానికులతో మాటామంతీ.
ముత్యాలమ్మ చెరువు వద్ద భోజన విరామం
ముత్యాలమ్మ చెరువు వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం
పుట్టపర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం
పులగంపల్లి వద్ద స్థానికులతో మాటామంతీ
మిట్టపల్లి వద్ద దివ్యాంగులతో భేటీ.
గొనుకువారిపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.