KA Paul: చంద్రబాబు.. దమ్ముంటే నాతో డిబేట్‌కు రా.. పవన్ అమ్ముడుపోయారన్న పాల్
ABN , First Publish Date - 2023-06-23T11:57:03+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prashanti party Chief KA Paul) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలవడానికి వెళ్ళానని.. కానీ ఆయన అక్కడ లేరని అన్నారు. కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యానన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లా (Janasena Chief PawanKalyan) 100 మంది బౌన్సర్స్లతో.. చంద్రబాబులా (Chandrababu Naidu) హై సెక్కురిటీతో తిరగడంలేదు.. సింగిల్‌గా వెళుతున్నానని అన్నారు. ‘‘చంద్రబాబు.. దమ్ముంటే నాతో డిబేట్‌కు రా.. ఎలాగూ లోకేష్‌కు మాట్లాడడం రాదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలేసి లోకేష్ కోసం నారాహి యాత్ర చేస్తున్నాడు. మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు. 15 సీట్లకు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడు.. దమ్ము ఉంటే 175 స్థానాల్లో పోటీ చెయ్యి. పవన్ కళ్యాణ్.. ప్రజాశాంతి పార్టీలోకి నీ పార్టీని విలీనం చెయ్యి. 2008లో పార్టీ పెట్టిన చిరంజీవి వెంట వెళ్లిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు’’ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజి స్టార్ అని అన్నారు. నన్ను ఓ కామెడీలా కొన్ని మీడియాలు చూపిస్తున్నాయని మండిపడ్డారు. ఆదాని, అంబానీలతో నార్త్ మీడియాను మోడీ కొనేశారని ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్‌లో విలీనం, పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో విలీనం అంటూ వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యా.. కేతిరెడ్డి వద్దు, బాబు వద్దు మీరు సీఎం కావాలని అన్నారన్నారు. 100 వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేఏపాల్ విమర్శలు గుప్పించారు.