NaraLokesh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న డీఎస్పీ.. లోకేష్ సమాధానం ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2023-04-11T12:06:19+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

NaraLokesh: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న డీఎస్పీ.. లోకేష్ సమాధానం ఏంటో తెలుసా?

తాడిపత్రి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ నేతలు (TDP Leaders), కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను తాడిపత్రి డీఎస్పీ చైతన్య (Tadipatri DSP Chaitanya)కలిశారు. ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దంటూ లోకేష్‌ (Nara lokesh)కు డీఎస్పీ సూచించారు. దీంతో డీఎస్పీకి లోకేస్ అదిపోయే సమాధానం చెప్పారు. ‘‘గత 67 రోజులుగా నేను పాదయాత్ర చేస్తున్నా.... ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లేదని’’ డీఎస్పీకి స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతిని.. ఎమ్మెల్యే అవినీతిని కచ్చితంగా తాను ఎండగడతానని తెలిపారు. ఈ క్రమంలో నోటీసులు తీసుకోవాలని డీఎస్పీ కోరగా.. అందుకు లోకేష్ నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక పాదయాత్ర ఆర్గనైజర్స్‌కు డీఎస్పీ నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈరోజు ఉదయం ఉలికుంటపల్లి విడిది కేంద్రం నుంచి 67వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. నేటితో శింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి అయ్యింది. తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఈ క్రమంలో లోకేష్‌కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి చేరుకుని లోకేష్‌కు పూలమాలతో స్వాగతం పలికారు.

అంతకుముందు ఉలికుంటపల్లి విడిది కేంద్రం వద్ద మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లోకేష్, టీడీపీ ముఖ్య నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అణ‌గారిన‌వ‌ర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని స్మృతిలో నివాళులు అర్పిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మ‌హిళ‌లు, అట్ట‌డుగువ‌ర్గాల ఆత్మ‌గౌర‌వ పోరాటానికి విద్య‌నే ఆయుధంగా అందించిన పూలే మ‌హాశ‌యుని ఆశ‌యసాధ‌న‌కి కృషి చేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌. జై పూలే అంటూ లోకేష్ నివాళి అర్పించారు. మరోవైపు యువగళంకు సంఘీభావంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు.

Updated Date - 2023-04-11T12:20:29+05:30 IST