Chandrababu: అనంతలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2023-09-04T09:54:28+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజులు పాటు అనంతలో పర్యటించనున్నారు. ఈనెల 5న రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో వేదవతి నదిపై నిర్మించిన బ్రిడ్జి వద్ద సెల్ఫీ చాలెంజ్, వేరుశనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు.
అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మూడు రోజులు పాటు అనంతలో పర్యటించనున్నారు. ఈనెల 5న రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో వేదవతి నదిపై నిర్మించిన బ్రిడ్జి వద్ద సెల్ఫీ చాలెంజ్, వేరుశనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. సాయంత్రం 6 గంటలకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో టీడీపీ చీఫ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాయదుర్గం పట్టణం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాల మైదానంలో చంద్రబాబు బస చేయనున్నారు. ఈనెల 6న రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ హైస్కూల్ విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఉరవకొండ నియోజకవర్గం పెద్దకౌకుంట్ల గ్రామంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమ్ సింహ వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన దంపతులను టీడీపీ చీఫ్ ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒంటిమిద్ధి గ్రామ సమీపంలో మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద సెల్ఫీ చాలెంజ్ చేయనున్నారు.
సాయంత్రం కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుంచి టీ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో అనంతరం టీ సర్కిల్లో ఏర్పాటు చేసిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడనున్నారు. కళ్యాణదుర్గం పట్టణం సమీపంలో ఉన్న జ్ఞాన భారతి హైస్కూల్‌లో బస చేయనున్నారు. ఈనెల 7న ఉదయం 10 గంటలకు మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక పేరుతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం టెక్స్‌టైల్ కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు గుంతకల్లు నియోజకవర్గం పామిడి సమీపంలో టెక్స్‌టైల్ కార్మికులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. సాయంత్రం ఐదు గంటలకు గుత్తి పట్టణంలోని ఎమ్మెస్ ఫుట్‌బాల్ మైదానంలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లి చంద్రబాబు వెళ్లనున్నారు.