YuvaGalam: 59వ రోజు లోకేష్ పాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2023-04-03T10:16:19+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది.
అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara lokesh Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. సోమవారం ఉదయం ముష్టూరు క్యాంప్ సైట్ నుంచి 59వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. సంజీవ్‌పురంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగలతో భేటీ అయ్యారు. ఎర్రయ్యపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతి నిర్వహించారు. లోకేష్ పాదయాత్ర (YuvaGalam Padayatra)లో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. లోకేష్ (Nara Lokesh)తో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తాము ఎదుర్కుంటున్న సమస్యలను యువనేత ముందు ఏకరవుపెడుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వారి సమస్యలను వింటున్న లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. 59వ రోజు పాదయాత్రలో నారా లోకేష్‌తో కలిసి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పాదయాత్రలో పాల్గొన్నారు.
నిన్న 58వ రోజు ధర్మవరం నియోజకర్గం సీఎన్బీ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలవగా... తొగట వీర క్షత్రియ సంఘం ప్రతినిధులు తాము నేసిన పట్టు వస్త్రాలతో లోకేష్‌ను సత్కరించారు. దీంతో యువనేత హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. చేనేత కార్మికులు, బోయ సామాజికవర్గీయులు, జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్వాసితులు లోకేష్‌ను కలిసి తమ తమ సమస్యలను విన్నవించారు. చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి సాగిస్తున్న ఇసుక మాఫియా దందాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బత్తలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు.