YuvaGalam: పింఛ‌ను పీకేసిన 6 ల‌క్ష‌ల మందితో సెల్ఫీ దిగు రిచ్ మోహ‌న్‌!: లోకేష్

ABN , First Publish Date - 2023-04-15T13:01:04+05:30 IST

రాష్ట్రంలో అనేక మందికి పింఛన్‌ రాకుండా చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

YuvaGalam: పింఛ‌ను పీకేసిన 6 ల‌క్ష‌ల మందితో సెల్ఫీ దిగు రిచ్ మోహ‌న్‌!: లోకేష్

అనంతపురం: రాష్ట్రంలో అనేక మందికి పింఛన్‌ రాకుండా చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్ర (YuvaGalama Padayatra) లో మాట్లాడుతూ... నిరుపేద వితంతువుకి ఇచ్చే భరోసా పింఛన్ తీసేసి ఏం మూటకట్టుకుంటావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దేశంలోనే రూ.510 కోట్లతో పెత్తందారీ సీఎం రిచ్ మోహ‌న్ రెడ్డి గారూ! నిరుపేద వితంతువుకి ఇచ్చే భ‌రోసా పింఛను తీసేసి ఏం మూట‌క‌ట్టుకుంటావు? ప్ర‌తీ ఇంటికి మేలు చేశామ‌ని, ఆ ఇంటివారితో నిజ‌మైన‌ సెల్ఫీ దిగుతాన‌ని గొప్ప‌గా చెప్పావు క‌దా రిచ్ మోహ‌న్‌. ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం తుగ్గ‌లి మండ‌లం శ‌భాష్‌పురం గ్రామంలో త‌లారి యంక‌మ్మ అనే వితంతువుకి రెండేళ్ల క్రిత‌మే పింఛ‌ను తీసేశావు. భోరున విల‌పిస్తున్న ఆ వితంతువుతో వ‌చ్చి సెల్ఫీ దిగు. ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌నుని, వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌గా పేరు మార్చావు. ఎన్నిక‌ల‌కి ముందు 3 వేలకి పెంచుతామ‌న్న పింఛ‌ను నాలుగేళ్ల‌యినా ఇంకా 3 వేల‌కి చేరలేదు. ఈ లోగానే త‌లారి యంక‌మ్మలాగే రాష్ట్రంలో 6 ల‌క్ష‌ల మంది బ‌తుకుల‌కి భ‌రోసా అయిన పెన్ష‌న్ పీకేశావు’’ అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. ఈరోజు ఉదయం 71వ రోజు పాదయాత్రను డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట క్యాంప్ సైట్ నుంచి యువనేత ప్రారంభించారు. కాసేపటి క్రితమే డోన్‌ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర పూర్తై పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జ్ కేఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా ముఖ్య నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి టీడీపీ యువనేతకు స్వాగతం పలికారు.

Updated Date - 2023-04-15T13:01:04+05:30 IST