YuvaGalam: కాసేపట్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర
ABN , First Publish Date - 2023-04-04T10:39:11+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 60వ రోజుకు చేరుకుంది.
అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Naralokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 60వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. రాప్తాడు నియోజకవర్గం పంగల్‌రోడ్డులోని క్యాంప్ సైట్ నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోకి మరికొద్దిసేపట్లో పాదయాత్ర ప్రవేశించనుంది. లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) అనంతపురం అర్బన్‌లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి (TDP in - charge Vaikuntham Prabhakar Chowdhary)పెద్ద ఎత్తున ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు చేరుకుని లోకేష్ (NaraLokesh)కు స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారు. పెద్ద పూలమాలతో లోకేష్‌కు అక్కడి నేతలు స్వాగతం పలకునున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటిని అధిగమించి లోకేష్ యువగళం (Lokesh YuvaGalam) పాదయాత్ర బ్రహ్మాండగా ముందుకు సాగుతోందని టీడీపీ నేతలు (TDP Leaders) చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని అంటున్నారు. పాదయాత్ర మొదలుపెట్టిన వేలావిశేషం కారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించని తెలిపారు. ఈ గెలుపుతో కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.
అంతకు ముందు పంగల్‌రోడ్డులోని క్యాంప్ సైట్‌లో సెల్ఫీవిత్ నారాలోకేష్ (Selfie With Lokesh) కార్యక్రమం జరిగింది. తనను కలవడానికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారితో లోకేష్ సెల్ఫీ దిగారు. తమ అభిమాన నేత అప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగడం పట్ల ప్రజలు ఆంనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజు వెయ్యి మందితో లోకేష్ ఫోటోలు దిగుతున్నారు.