YuvaGalam Padayatra: 66వ రోజుకు లోకేష్ యువగళం పాదయాత్ర.. సెల్ఫీ కోసం క్యూ
ABN , First Publish Date - 2023-04-10T13:31:52+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 66వ రోజుకు చేరుకుంది.
అనంతపురం: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 66వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాదయాత్ర జోరుగా సాగుతోంది. యుగళం పాదయాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, శ్రేణులు వేల సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. శింగనమల నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర (YuvaGalam) సాగుతోంది. పాదయాత్ర ఇప్పటికే 830 కిలోమీటర్లు దాటింది. శింగనమల నియోజకవర్గ పరిధిలోని బోధనంపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సోదనపల్లిలో పలు సామాజిక వర్గాలతో లోకేష్ భేటీ అయ్యారు. బోధనంపల్లిలో రాత్రి బస చేసిన క్యాంప్ వద్ద లోకేష్ (Nara lokesh)తో సెల్ఫీ కోసం అభిమానులు క్యూకట్టారు. వేల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోకేష్ సెల్ఫీలు ఇస్తూ ప్రతిఒక్క కార్యకర్తను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ అభిమాన నేత అప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు ఉదయం బోధనంపల్లి క్యాంప్ నుంచి పాదాయాత్ర మొదలైంది. పలు సామాజిక వర్గాలు, స్థానికులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్ పాదయాత్రలో పెద్దఎత్తున మహిళలు, వృద్ధులు ఎదురొచ్చి మరీ ఘన స్వాగతాలు పలుకుతున్నారు. అక్కడి నుంచి బలకంచెరువు గ్రామంలో గార్ల సామాజిక వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యాదవ సామాజిక వర్గీయులు తమ సమస్యలను లోకేష్ ముందు ఏకరువుపెట్టారు. శింగనమల నియోజకవర్గంలో యాదవ భవనం నిర్మించాలని, రాజకీయాల్లో యాదవ సామాజిక వర్గీయులకు పదవులు ఇచ్చి, ప్రాధాన్యత కల్పించాలంటూ లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.