Payyavula Keshav: రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
ABN , First Publish Date - 2023-07-07T17:47:11+05:30 IST
వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM JAGAN)... ఏం ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి భజన చేయడమే విశ్వేశ్వర్ రెడ్డి పని.. రైతుల కష్టాలు విశ్వేశ్వర్ రెడ్డికి పట్టవు. ఇళ్ల ముందు డ్రైనేజ్ వేయని నేతలు.. ప్రాజెక్టులు కడతారా?
అనంతపురం: రైతులు భూములు చూస్తే వైసీపీ నేతలకు కనిపించేది రియల్ ఎస్టేట్ వ్యాపారమని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. చలో కలెక్టరేట్‌లో పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ‘‘వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం (YCP Government) కంకణం కట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM JAGAN)... ఏం ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి భజన చేయడమే విశ్వేశ్వర్ రెడ్డి పని.. రైతుల కష్టాలు విశ్వేశ్వర్ రెడ్డికి పట్టవు. ఇళ్ల ముందు డ్రైనేజ్ వేయని నేతలు.. ప్రాజెక్టులు కడతారా? కరవుతో పోరాటం చేస్తున్న అనంతపురం జిల్లా రైతాంగం... ప్రభుత్వం ఇచ్చే రూ.7 వేల రూపాయలకు దేహి అని ఎవరూ ఎదురు చూడరు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుపై మాట్లాడే ధైర్యం లేని వైసీపీ నేతలు జిల్లాకు ఏం చేస్తారు? రైతుల విషయంలో మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి (TDP) మాత్రమే ఉంది. చంద్రబాబు (Chandrababu) మాత్రమే పంట నష్టపరిహారం, పంటల బీమా ప్రవేశపెట్టారు. వైఎస్‌పై అభిమానం ఉంటే వేరే రకంగా చూసుకోండి.. అంతేకాని తండ్రి పేరు చెప్పుకుని రైతుల ఓట్లు అడగొద్దు.’’ అని పయ్యావుల హితవు పలికారు.