AP News: అతన్ని పోలీసులే కిడ్నాప్ చేశారు: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2023-05-03T21:46:38+05:30 IST
పోలీసులు, వైసీపీ (YCP) నేతలు కుమ్మక్కై టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తల్ని వేధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: పోలీసులు, వైసీపీ (YCP) నేతలు కుమ్మక్కై టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తల్ని వేధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి (Vijay Kumar Reddy)ని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. రెండ్రోజుల నుంచి విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో పోలీసులు ఆచూకీ చెప్పటం లేదని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ గూండాల్లా వ్యవహరించటం దుర్మార్గమన్నారు. విజయ్ కుమార్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని కుటుంబ సభ్యులు వాపోతున్నారని తెలిపారు. విజయ్ కుమార్ రెడ్డికి ఏదైనా జరిగితే పోలీసులు, డీజీపీదే భాద్యత అన్నారు.