Atchannaidu: ఇలా చేయడానికి వైసీపీకి సిగ్గుండాలి

ABN , First Publish Date - 2023-08-26T16:02:22+05:30 IST

నాలుగున్నరేళ్ల కాలంలో ఎన్నో కష్టాలు పడ్డామని.. జగన్ పెట్టిన కష్టాలు మరువకుండా కసితో పని చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: ఇలా చేయడానికి వైసీపీకి సిగ్గుండాలి

అమరావతి: నాలుగున్నరేళ్ల కాలంలో ఎన్నో కష్టాలు పడ్డామని.. జగన్ పెట్టిన కష్టాలు మరువకుండా కసితో పని చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP AP Chief Atchannaidu) అన్నారు. చంద్రబాబు ష్యూర్టీ.. భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో టీటీడీ (TTD) పవిత్రతను మంట కలిపారని మండిపడ్డారు. ఓ క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మనుగా నియమించారన్నారు. పెనాక శరత్ చంద్రారెడ్డి లాంటి దొంగని టీటీడీ సభ్యుడిగా వేశారన్నారు. ఇసుక దోపిడీపై ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఇసుక సత్యాగ్రహం పేరుతో ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జరుగుతోందన్నారు. జిల్లాలు దాటుతోన్న కొద్దీ యువగళం పాదయాత్రకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. పాదయాత్రలో పాల్గొన్న నేతలపై దాడులు చేసి.. తిరిగి వారి పైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 31న యువగళం పాదయాత్ర ప్రారమభమై 200 రోజులకు చేరుకుంటుందని.. ఈ నెల 31న యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలపాలన్నారు. ఆ సంఘీభావ యాత్రలో జగన్ ప్రభుత్వ బాధితులను భాగస్వామ్యం చేయాలని అచ్చెన్న అన్నారు.


వచ్చే నెల 1 నుంచి 45 రోజుల పాటు బాబు ష్యూర్టీ.. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించాలన్నారు. కోటి ఇళ్లను టచ్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను.. వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని.... సభలు పెట్టాలని కార్యకర్తలకు తెలిపారు. అన్ని సామాజిక వర్గాలను ఆకర్షించే విధంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) 30 నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. రాయలసీమ నుంచి చంద్రబాబు పర్యటనలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఓటర్ వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితా విషయంలో దొంగే దొంగ అంటూ వైసీపీ కామెంట్లు చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేస్తుంటే.. తామూ ఫిర్యాదు చేస్తామంటూ వైసీపీ కూడా సీఈసీని కలుస్తారట.. ఇలా చేయడానికి వైసీపీకి సిగ్గుండాలి అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-26T16:02:22+05:30 IST