Atchannaidu: అవినీతి పితామహుడు జగన్
ABN , First Publish Date - 2023-10-17T14:22:21+05:30 IST
అవినీతి పితామహుడు జగన్ అని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
శ్రీకాకుళం: అవినీతి పితామహుడు జగన్ (CM Jagan) అని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో అవినీతిలో పుట్టి పెరిగి బ్రతికిన వ్యక్తి జగన్ అని.. రూ.45 వేల కోట్లు ఈడీ జప్తు చేసిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) చేసిన తప్పు ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే బాబు చేసిన తప్పా అని నిలదీశారు. చంద్రబాబును ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఏ తప్పూ చేయకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఇప్పటి వరకూ వైసీపీ పిచ్చి కుక్కలు ఒక్క ఆధారం చూపలేకపోయాయని విరుచుకుపడ్డారు. దిక్కుమాలిన ప్రభుత్వం రోజుకొక మాట మార్చుతోందన్నారు. స్కిల్ కేసులో పస లేదని... అందుకే రోజుకొక పిటిషన్ వేసి కాలయాపన చేస్తున్నారన్నారు. సుప్రీం కోర్టులో (Supreme Court)చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పొత్తు తర్వాత వైసీపీ నేతలు పోటీకి భయపడుతున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.