Share News

BJP : జగన్ మద్యం కుంభకోణంపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. ఏం జరుగునో..?

ABN , First Publish Date - 2023-11-04T12:36:02+05:30 IST

ఏపీ సీఎం జగన్ మద్యం కుంభకోణంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. హై కోర్టులో పిల్ దాఖలు చేయాలని ఏపీ బీజేపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ నేతలు పిల్‌ను సిద్ధం చేస్తున్నారు. జగన్ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు పురందేశ్వరి లేఖ రాశారు.

BJP : జగన్ మద్యం కుంభకోణంపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. ఏం జరుగునో..?

ఢిల్లీ : ఏపీ సీఎం జగన్ మద్యం కుంభకోణంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. హై కోర్టులో పిల్ దాఖలు చేయాలని ఏపీ బీజేపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ నేతలు పిల్‌ను సిద్ధం చేస్తున్నారు. జగన్ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు పురందేశ్వరి లేఖ రాశారు. తమ చేతికి మట్టి అంటకుండా కోర్టుల ద్వారానే జగన్ మద్యం కుంభకుణం వెలుగులోకి తీసుకురావాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మద్యం కుంభకోణంపై పురందేశ్వరి, విజయసాయిల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. విజయసాయి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకే పురందేశ్వరి లేఖ రాసిన విషయం తెలిసిందే. విజయసాయి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టుని కూడా పురందేశ్వరి ఆశ్రయించనున్నారు. ప్రస్తుతం పురందేశ్వరి లేఖపై అమిత్ షా ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

అంతకు ముందు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు. విజయసాయి పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు దిగారని ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జిగా వున్న సమయంలో కడప గూండాలను దించి అక్కడ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని పురందేశ్వరి పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పు దోవ పట్టించారన్నారు. ఆయనపై ఉన్న కేసుల వివరాలను పురందేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-04T13:10:51+05:30 IST