BJP: జనవరి ఒకటో తేదీ సీఎంగా జగన్‌కు చివరి రోజు.. బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 31 , 2023 | 02:09 PM
జనవరి ఒకటో తేది ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి చివరి రోజు అని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే రోజులు దగ్గర పడ్డాయని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణకు జగన్ అన్యాయం చేశారని మండిపడ్డారు.
విశాఖపట్నం: జనవరి ఒకటో తేది ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి చివరి రోజు అని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే రోజులు దగ్గర పడ్డాయని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణకు జగన్ అన్యాయం చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటు వేయకూడదని ఆయన సూచించారు. సిగ్గు లేకుండా జగన్ మళ్లీ ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరమని విష్ణుకుమార్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలు తరవాత ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేస్తామని ఆయన చెప్పారు.
విశాఖలో మురికి పేరుకుపోయిందని చెప్పారు. ఈ అధికారులు ఫోటోలకు చెత్త ఎత్తుతున్న ఫోజులు పెడుతున్నారు తప్ప చెత్త మాత్రం అలాగే ఉందని తెలిపారు. ఈ సీఎంకి పబ్లిసిటీ పిచ్చి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి గుడ్డు మీద కూడా సీఎం బొమ్మే ఉందని చెప్పుకొచ్చారు. కనీసం ఈ మూడు నెలలైనా అరాచకాలు ఆపాలని ఆయన కోరారు. వాట్సాప్ మెసేజ్ చేస్తే కూడా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త సంవత్సరం నుంచైనా జగన్ మారుతారని అనుకుంటున్నానని విష్ణుకుమార్ రాజు చెప్పారు.