AP Assembly: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్‌‌‌ వ్యవహారంపై స్వల్పకాలిక చర్చ

ABN , First Publish Date - 2023-09-22T12:04:51+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్‌లో జరిగిన అవకతవకలు, అవినీతి నిరూపణకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఏపీ అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ చేపట్టారు. సభలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే తన తాబేదార్లుకు దోచిపెట్టాలని చూశారని ఆరోపించారు. స్కిల్ కేసులో చంద్రబాబు చేసింది అదే అని అన్నారు. సీమెన్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో పాటు డిజైన్ టెక్‌ను దీనిలో ఇన్వాల్వ్ చేశారన్నారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్‌‌‌ వ్యవహారంపై స్వల్పకాలిక చర్చ

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్‌లో (Skil devolepment Issue) జరిగిన అవకతవకలు, అవినీతి నిరూపణకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. సభలో మాజీ మంత్రి కన్నబాబు (Former Minister Kannababu) మాట్లాడుతూ... 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే తన తాబేదార్లుకు దోచిపెట్టాలని చూశారని ఆరోపించారు. స్కిల్ కేసులో చంద్రబాబు చేసింది అదే అని అన్నారు. సీమెన్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో పాటు డిజైన్ టెక్‌ను దీనిలో ఇన్వాల్వ్ చేశారన్నారు. తెలంగాణకు చెందిన ఇల్లెందుల రమేష్ 2014 జులైలో అప్రోచ్ అయ్యారని తెలిపారు. తరువాత చంద్రబాబు సన్నిహితుడు గంటా సుబ్బారావుతో యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఆడిటర్‌గా టీడీపీ ఆడిటర్‌ను నియమించారని.. యుద్ధ ప్రాతిపదికన జీవోలు ఇచ్చి హైయర్ ఎడ్యూకేషన్ అక్కడి నుంచి అచ్చన్న శాఖకు బదిలీ చేశారని చెప్పారు.


ఈ ఎంవోయూ కూడా ఓ బోగస్ అని... అపర్ణ అనే ఒక ఐఏఎస్‌ను కూడా ఇక్కడ నియమించారన్నారు. సుమన్ బోస్, కల్వేకర్, ముకుల్ అగర్వాల్ వీరు ముగ్గురు డిలైట్‌లో కలిసి పనిచేశారన్నారు. స్కిల్లర్ అనే డొల్ల కంపెనీని కూడా వెంటనే సృష్టించారన్నారు. బడ్జెట్‌‌ను ఆగమేఘాల మీద డబ్బులు రిలీజ్ చేశారని.. ఆర్ధిక శాఖ అడ్డు చెప్పినా వినలేదని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 5 నుంచి మార్చిలోపు రూ.371 కోట్లు రిలీజ్ చేశారన్నారు. ఈ నిధులు సిమెన్స్‌కు కాకుండా డొల్ల కంపెనీలకు రిలీజ్ చేశారని తెలియజేశారు. ముందు డిజైటన్ టెక్‌కు అక్కడి నుంచి షెల్ కంపెనీకి పంపారన్నారు. తరువాత పీవీఎస్పీకి రూ.271 కోట్లు రిలీజ్ చేశారన్నారు. అక్కడి నుంచి 12 డొల్ల కంపెనీలకు పంపారని కన్నబాబు వెల్లడించారు.

Updated Date - 2023-09-22T12:04:51+05:30 IST