Chandrababu: ఆ పని చేసింది వైసీపీ గూండాలే..
ABN , First Publish Date - 2023-02-21T22:41:33+05:30 IST
గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిపై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా: గన్నవరం(Gannavaram) టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిపై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ...గన్నవరం ఎయిర్‌పోర్టులో అడుగడుగునా పోలీస్ బందోబస్తుపై చంద్రబాబు ధ్వజమెత్తారు.ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. తనను కలవడానికి వచ్చినవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? అని నిలదీశారు.ఎయిర్‌పోర్టులో ఇన్ని పోలీస్ బలగాలను ఎందుకు ఏర్పాటు చేశారని మండిపడ్డారు.ఇది ప్రజాస్వామ్యం.. మీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదన్నారు. పోలీసులు ఇక జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు.
పట్టాభి కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ
టీడీపీ నేత పట్టాభిరామ్(Pattabhiram) నివాసానికి చంద్రబాబు చేరుకుని పట్టాభి కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు.పట్టాభిరామ్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏపీలో సైకో పాలన కొనసాగుతోందన్నారు. టీడీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిచేసిన వైసీపీ(ycp) గూండాలను వదిలేసి.. టీడీపీ నేతలపైనే అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఐ కనకరావును కొట్టింది వైసీపీ గూండాలేనని చెప్పారు.వైసీపీ నేతలను పోలీసులు బతిమాలుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయన్నారు.దోషులు ఎప్పటికైనా పట్టుబడక తప్పదని హెచ్చరించారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనైతే పోలీసు వ్యవస్థే దిగజారిపోతుందని మందలించారు.వైసీపీ నేతలు ఏం చేసినా భరించాలా? అని నిలదీశారు.జగన్ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతామన్నారు.పోలీసుల తీరుపై రేపటి నుంచి జనంలోకి వెళ్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
గన్నవరంలో (Gannavaram) వైసీపీ శ్రేణులు (YCP leaders) రెచ్చిపోయాయి. విధ్వంసం సృష్టించాయి. గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.
గోపిరెడ్డి కనుసన్నల్లోనే బాలకోటిరెడ్డి హత్య: అచ్చెన్న
జగన్‌రెడ్డి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) అన్నారు. జగన్ రౌడీపాలన పల్నాడులో మరో టీడీపీ కార్యకర్తను బలి తీసుకుందన్నారు.టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డిని వైసీపీ గూండాలు కాల్చి చంపారని చెప్పారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే బాలకోటిరెడ్డి హత్య జరిగిందన్నారు. బాలకోటిరెడ్డి హత్యలో నిందితులను,..హత్య చేయించిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాల కోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?
......................................................................................................
TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!
......................................................................................................
YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!
li