Chandrababu : ఏపీని రావణకాష్టంలా మారుస్తున్న జగన్
ABN , First Publish Date - 2023-02-20T22:48:34+05:30 IST
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని,.. వాహనాలను తగులబెట్టిన ఘటనపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారు.
గన్నవరం: గన్నవరంలో (Gannavaram) వైసీపీ శ్రేణులు (YCP leaders) రెచ్చిపోయాయి. విధ్వంసం సృష్టించాయి. గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు. కాగా గన్నవరంలో జరిగిన దాడిపై తెలుగుదేశం నేతలు వైసీపీ ప్రభుత్వం. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ శాఖను వైసీపీలో విలీనం చేశారా? : చంద్రబాబు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని,.. వాహనాలను తగులబెట్టిన ఘటనపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..‘‘ వైసీపీ అరాచకాలపై గవర్నర్(Governor) తక్షణం జోక్యం చేసుకోవాలి. పోలీస్ శాఖను మూసేశారా.. వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. ఏపీని రావణకాష్టంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం.వైసీపీ ఉన్మాదులు అరాచకాలకు పాల్పడుతుంటే... పోలీసులు గాడిదలు కాస్తున్నారా? గన్నవరం ఘటన కారకులపై గవర్నర్ చర్యలు తీసుకోవాలి’’ అని వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంశీ.. ఒక్క ఏడాది ఓపికపట్టు నీతల పొగరు అణిచివేస్తాం: అచ్చెన్న
సైకో సీఎం అండతో వైసీపీ ఆకురౌడీలు చెలరేగిపోతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achchennaidu) అన్నారు. సోమవారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీపాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఎమ్మెల్యే వంశీ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందన్నారు. వంశీ రౌడీలు పట్టపగలే టీడీపీ కార్యాలయంలోకి చొరబడి.. కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అరాచకం సాగుతోందన్నారు.‘వంశీ.. ఒక్క ఏడాది ఓపికపట్టు నీతల పొగరు అణిచివేస్తాం’ అని అచ్చెన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గన్నవరం అరాచకుడికి బుద్ధి చెబుతాం: నారా లోకేష్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తీవ్రంగా ఖండించారు. సోమవారం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై జగన్‌రెడ్డి చేయిస్తున్న ఒక్కోదాడి.. వైసీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక అవుతుంది. వంశీ గూండాలు టీడీపీ నేతలపై దాడి చేసి వాహనాలు తగలబెడుతుంటే.. పోలీసులు ప్రేక్షకుల్లా చూడడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. గన్నవరం అరాచకుడికి బుద్ధి చెబుతాం’ అని నారా లోకేష్ మండిపడ్డారు.
కారు తగులబెడితే నో కేస్.. సామగ్రి ధ్వంసం చేస్తే నో కేస్: వర్ల రామయ్య
గన్నవరం వివాదంలో పోలీసులది ప్రేక్షక పాత్ర అని టీడీపీ నేత వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు. సోమవారం వర్లరామయ్య ABNతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు.పోలీసులు ఓరియంటేషన్ క్లాసులకు హాజరుకావాలని సూచించారు. రౌడీషీటర్లను కట్టడి చేయలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారని చెప్పారు. కారు తగులబెడితే నో కేస్.. సామగ్రి ధ్వంసం చేస్తే నో కేస్ అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంశీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: కొల్లు రవీంద్ర
నపుంసక చర్యలకు వంశీ(Vallabhaneni Vamsi) పాల్పడటం సిగ్గుచేటని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. సోమవారం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వంశీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. విజ్ఞులైన ప్రజలు ఈ రాక్షస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పారు.చంద్రబాబును అడ్డుకుంటే ప్రజాతిరుగుబాటు తప్పదన్నారు.చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణతో జగన్‌కు చమటలుపడుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చే చర్యలకు జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని కొల్లు రవీంద్ర అన్నారు.
వంశీ వెన్ను విరవడం తథ్యం: ధూళిపాళ్ల నరేంద్ర
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) అన్నారు. సోమవారం ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వంశీ వెన్ను విరవడం తథ్యం. చంద్రబాబు పేరుతో గెలిచి ఆయనపైనే విమర్శలు చేయడం సిగ్గుచేటు.ఏపీలో జగన్రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారు.ప్రశ్నించిన వారికి కత్తులతో సమాధానం చెప్పడం ఆటవిక పాలన... గూండాలు, రౌడీలు పేట్రేగడానికి జగన్రెడ్డే కారణం.కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేయడం వంశీ పశు సంస్కృతికి నిదర్శనం.నెత్తిన రూపాయి పెడితే.. పావలాకు అమ్ముడుపోలేని దద్దమ్మ వంశీ’’ అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
ఈ దాడి దుర్మార్గం: చినరాజప్ప
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని టీడీపీ నేత చినరాజప్ప(Chinarajappa) చెప్పారు. సోమవారం చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పేరుతో గెలిచిన వంశీ ఆయనపైనే విమర్శలు చేయడం దారుణమన్నారు.ప్రశ్నించినవారికి కత్తులతో సమాధానం చెప్పడం ఆటవిక పాలన.. గూండాలు, రౌడీలు పేట్రేగిపోవడానికి జగన్ రెడ్డే కారణమని చినరాజప్ప దుయ్యబట్టారు.
......................................................................................................
MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..
......................................................................................................
YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!
......................................................................................................