AP News: చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది: కనకమేడల
ABN , First Publish Date - 2023-04-22T16:21:45+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఎంపీ కనకమేడల రవీంద్ర (MP Kanakamedala Ravindra) ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఎంపీ కనకమేడల రవీంద్ర (MP Kanakamedala Ravindra) ఆందోళన వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎంకు.. ప్రసుత్తం సీఎం జగన్ (CM Jagan) ఇచ్చిన భద్రత ఇదేనా అని ప్రశ్నించారు. ఏపీలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. పోలీసుల అనుమతితో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుపై దాడి పట్ల కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తీరు అసభ్యకరంగా ఉందని దుయ్యబట్టారు. ఆదిమూలపు సురేష్ దాడులు, పోలీసులతో మాట్లాడిన.. వీడియోలు అన్ని బయటకు వచ్చాయని తెలిపారు. ఎన్‌ఎస్‌జీ (NSG) సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అడ్డుపెట్టి.. చంద్రబాబును కాపాడారని కనకమేడల రవీంద్ర తెలిపారు.
ప్రకాశం జిల్లా (Prakasam District) యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆయన పర్యటనకు నిరసన పేరిట పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్ (Adimulapu Suresh) నేతృత్వంలో అరాచకానికి దిగారు. స్వయంగా ముందుండి తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పారు. పోలీసులు కూడా చోద్యం చూస్తూ నిలబడిపోయారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్‌ఎస్‌జీ కమాండెంట్ సంతోష్‌కుమార్ తలకు గాయమైంది. ప్రకాశం జిల్లాలో మూడ్రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్నారు. బుధ, గురువారాల్లో గిద్దలూరు, మార్కాపురం రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తారు. దీంతో చివరి రోజైన శుక్రవారం మంత్రి సురేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెంలో బాబు పర్యటనను అడ్డుకోవాలని అధికార వైసీపీ ఎత్తువేసింది.