MLC elections: ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2023-03-11T16:26:49+05:30 IST

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) పై ప్రజలకు చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ (YCP)కి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

MLC elections: ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) పై ప్రజలకు చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ (YCP)కి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలతో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. టీడీపీ అభ్యర్థులు (TDP Candidates) చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి (Bhumi Reddy Ram Gopal Reddy)ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించామని, క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను అధిగమించి పెట్టుబడులు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. నేడు వైసీపీ ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయి.. ఏపీలో నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్‌తో అవగాహనకు వచ్చామని తెలిపారు. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్‌ అభ్యర్థులకు వేయాలని కోరారు. పీడీఎఫ్‌కు ఓటేసినవారు రెండో ప్రాధాన్య ఓటు టీడీపీకి వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

మార్చి 13న ఎన్నికలు

14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 8 స్థానిక సంస్థల్లోని 9 నియోజకవర్గాలు, మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల షెడ్యూల్‌ (Election Schedule) విడుదల చేసింది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ (Polling) జరుగుతుంది. అదే నెల 16న ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

Updated Date - 2023-03-11T16:26:49+05:30 IST