SelfieChallengeToJagan: ‘చూడు జగన్’ అంటూ ఏపీ సీఎంను చెడుగుడు ఆడుకున్న చంద్రబాబు..!

ABN , First Publish Date - 2023-04-07T15:53:03+05:30 IST

సీఎం జగన్ (CM Jagan) కు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగారు.

SelfieChallengeToJagan: ‘చూడు జగన్’ అంటూ ఏపీ సీఎంను చెడుగుడు ఆడుకున్న చంద్రబాబు..!

నెల్లూరు: సీఎం జగన్ (CM Jagan) కు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన.. టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగారు. ‘‘చూడు....జగన్!.. ఇవే టీడీపీ (TDP) హయాంలో.. పేదలకు కట్టించిన వేలాది టిడ్కో ఇళ్లు (Tidco Houses). ఏపీలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం. నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని?.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడా?.. జవాబు చెప్పగలవా? ’’ అంటూ జగన్కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోతోచంద్రబాబు ట్వీట్ చేశారు. తన సెల్ఫోన్తో టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర.. సెల్ఫీ దిగి చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ (Selfie challenge) విసరాలని ఇప్పటికే క్యాడర్కు, లీడర్స్కు చంద్రబాబు పిలుపునిచ్చారు.

టెక్నాలజీ అంటే నేనే గుర్తుకొస్తా

టెక్నాలజీ అంటే తానే గుర్తుకొస్తానని, తాము తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో తెలుగువారు రాణిస్తున్నారని గుర్తుచేశారు. పార్టీ వ్యవస్థను ప్రతి కుటుంబంలోకి తీసుకెళ్లామని ప్రకటించారు. 25 వేల ఓట్ల సామర్ధ్యం పెంచుకునే అవకాశం క్లస్టర్ ఇన్‌చార్జ్‌లకు ఉందని, ఎవరు పొరపాటు‌ చేసినా.. కరెక్ట్ చేసే బటన్ తన చేతిలో ఉందన్నారు. చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం స్కూల్ నడుపుతున్నామని చంద్రబాబు తెలిపారు.

ఇంకేముంది ఇళ్లు వచ్చేస్తున్నాయ్‌.. అంటూ పేదలు ఆనందపడ్డారు. అనుకున్నట్టుగానే గృహ నిర్మాణాలు భారీగా సాగాయి.. అను కున్నదానికంటే ముందే గృహాలు ఇచ్చేస్తారని అంతా ఆశించారు. చాలా మంది అప్పులు చేసి మరీ డిపాజిట్లు (Deposits) చెల్లించారు.. తీరా చూస్తే ప్రభుత్వం మారింది.. వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అధికారంలోకి వచ్చింది.. నాలుగేళ్లుగా ఇల్లు కలగా మిగిలి పోయింది. నేటికీ ఇళ్లెప్పుడిస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. నగరాలు, పట్టణాల్లో సామాన్య, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో లబ్ధిదారులను ఏళ్లుగా ఊరిస్తున్నాయి. దీంత ఈ నిర్మాణాలకు పట్టిన గ్రహణం వీడేది ఎప్పుడోనంటూ లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు.

ఈ భవనాల్లో మిగిలిన వసతులు కల్పిస్తే పంపిణీకి సిద్ధమవుతాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఏళ్లుగా లబ్ధిదారులు ఎదరుచూపులు చూడాల్సి వస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చేపట్టిన టిడ్కో ఇళ్లు ఇప్పటికీ చేతికి రాక లబ్ధిదారులు ఎదరుచూపులు చూస్తున్నారు. 2018లో ప్రారంభమైన ఈ నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవడం, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారంతా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల టిడ్కో ఇళ్ల చుట్టూ పొదలు పెరిగాయి. ఖాళీగా ఉండడం తో పాములు, కీటకాలకు ఆలవాలంగా మారాయి. కొన్నిచోట్ల అసాంఘిుక కార్యకలాపాలకు అడ్డాగా రూపాంతరం చెందాయి.

Updated Date - 2023-04-07T16:49:38+05:30 IST