TTD: 2024 జనవరి మాసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2023-10-12T13:39:57+05:30 IST
2024 జనవరి మాసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబర్ 18న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. 22న 10 గంటలకు లక్కీ డిప్ల్‌లో సేవా టిక్కెట్లను టీటీడీ కేటాయించనుంది.
తిరుమల: 2024 జనవరి మాసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను అక్టోబర్ 18న ఆన్‌లైన్‌లో టీటీడీ (TTD) విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. 22న 10 గంటలకు లక్కీ డిప్ల్‌లో సేవా టిక్కెట్లను టీటీడీ కేటాయించనుంది. అలాగే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 21న ఉదయం 10 గంటలకు విడుదలకానున్నాయి. వర్చువల్ సేవా టికెట్లను అక్టోబర్ 21న, మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటా అక్టోబర్ 23న, ఉదయం 10 గంటలకు విడుదలకానుంది. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను అక్టోబర్ 23న, ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. వీటితో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24న, తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ను అక్టోబర్ 25న, ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.