Nara Lokesh: కర్నాటక పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన లోకేష్

ABN , First Publish Date - 2023-01-30T16:07:25+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra)లో ఏపీ-కర్నాటక సరిహద్దులో ఓ అసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.

Nara Lokesh: కర్నాటక పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన లోకేష్

పలమనేరు (చిత్తూరు జిల్లా): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra)లో ఏపీ-కర్నాటక (AP-Karnataka) సరిహద్దులో ఓ అసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో కర్నాటక పరిధిలో వచ్చిన రోడ్లపై ఆ రాష్ట్ర పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సరిహద్దు దాటి తిరిగి ఏపీలోకి అడుగుపెట్టేలోపు లోకేష్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీడీపీ నేతలు (TDP Leaders) కర్నాటక పోలీసు (Karnataka Police)లను అభినందించారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ సరిహద్దులో లోకేష్ పాదయాత్రకు కర్నాటక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. లోకేష్ పాదయాత్రకు కర్నాటక పోలీసులు కల్పించిన భద్రత, వాళ్లు వ్యవహరించిన తీరు అద్భుతమని మరో టీడీపీ నేత అన్నారు. కర్నాటక పోలీసులను చూసి ఆంధ్రా పోలీసులు (Andhra Police) నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా 4వ రోజు సోమవారం ఉదయం పలమనేరు నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. వి.కోటలో పట్టుగూళ్ల రైతులు లోకేష్‌ను కలిశారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే.. సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈరోజు కృష్ణాపురం క్రాస్ వరకు లోకేష్‌ పాదయాత్ర సాగనుంది. రాత్రికి కృష్ణాపురం టోల్‌గేట్ సమీపంలో ఆయన బస చేస్తారు.

కాగా సోమవారం పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ ‘సెల్ఫీ విత్ లోకేష్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి సెల్ఫీలు దిగారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంతో ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకేష్.. జగన్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు.

Updated Date - 2023-01-30T18:20:50+05:30 IST