Rains: తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు.. ప్రయాణికుల అవస్థలు
ABN , First Publish Date - 2023-12-04T22:11:48+05:30 IST
తిరుపతి జిల్లాలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోకుల కృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తున్నది. కాళంగి నదికి నదికి ఇరువైపులా జాతీయ రహదారిని బారికెడ్లతో పోలీసులు మూసివేశారు.
తిరుపతి : తిరుపతి జిల్లాలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోకుల కృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తున్నది. కాళంగి నదికి నదికి ఇరువైపులా జాతీయ రహదారిని బారికెడ్లతో పోలీసులు మూసివేశారు. దీంతో నెల్లూరు, చెన్నై , తమినాడు- ఆంధ్రప్రదేశ్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని లేదంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తిరుపతి జిల్లా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాను కారణంగా రేపు (మంగళవారం) కూడా తిరుపతి జిల్లాలో స్కూళ్లు, కళాశాలలకు తిరుపతి కలెక్టర్ సెలవులు ప్రకటించారు.