Lokesh YuvaGalam: 20వ రోజు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే....
ABN , First Publish Date - 2023-02-15T09:14:00+05:30 IST
జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది.
చిత్తూరు: జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalam Padayatra) విజయవంతంగా ముందుకు సాగుతోంది. లోకేష్ పాదయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నీరాజనాలు పలుకుతున్నారు. నేటితో లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) 20వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం కీలపూడి నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 1:40 గంటలకు వెంకటరెడ్డి కండ్రిగలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. సాయంత్రం 6:35 గంటలకు సదాశివపురంలో స్థానికులతో లోకేష్ (YuvaGalam) మాటామంతీ నిర్వహించనున్నారు. మరోవైపు పాదయాత్రకు ముందు సెల్ఫీవిత్ లోకేష్ (Selfie With Lokesh) కార్యక్రమంలో యువనేత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతిరోజు 1000మందితో లోకేష్ సెల్ఫీ (Lokesh Selfie) దిగుతున్నారు. తమ అభిమాన నేత అప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా... నిన్న నారాయణవనం మండలం వెత్తలతడుకు నుంచి పాదయాత్ర (YuvaGalama Padayatra) ను మొదలుపెట్టిన లోకేష్ (Lokesh YuvaGalam)కు అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లోకేష్‌ను కలిసేందుకు వివిధ సామాజికవర్గ ప్రజలు, స్థానిక ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. పాదయాత్రలో భాగంగా వెదురు కళాకారులతో లోకేష్ (NaraLokeshForPeople) ముఖాముఖి సమావేశమయ్యారు. గోవిందప్పకండ్రిగలో స్థానికులతో మాటామంతిలో పాల్గొన్నారు. ఆ తరువాత అరణ్యకండ్రిగలో దాసరి, పద్మశాలి సామాజిక వర్గీయులతో యువనేత (LokeshYuvaGalam) సమావేశమయ్యారు. కృష్ణంరాజులకండ్రిగలో స్థానికులతో మాటామంతిలో పాల్గొని తుంబూరులో ఎస్సీ సామాజిక వర్గీయులతో భేటీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపై పలమగలంలో ముస్లిం మైనార్టీలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. రాత్రా పిచ్చాటూరు మండలంలోకి కీలకపూడిలో లోకేష్ బస చేశారు.