YuvaGalam: మరోసారి మైక్ లాక్కున్న పోలీసులు... పాదయాత్రలో ఉద్రిక్తం
ABN , First Publish Date - 2023-02-11T12:38:42+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
చిత్తూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh YuvaGalam Padayatra)కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ఎస్‌ఆర్‌పురం హనుమాన్ టెంపుల్ విడిది నుంచి 16వ రోజుపాదయాత్రను లోకేష్ (Lokesh Padayatra) ప్రారంభించారు. పాదయాత్ర పుల్లూరు క్రాస్ వద్దకు రాగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయమంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. కార్యకర్తలను పంపించేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. మాట్లాడేందుకు మైక్‌ను కూడా అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో స్టూల్ మీదే నిలబడి లోకేష్మా (YuvaGalam Padayatra)ట్లాడారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పుల్లూరు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్యాలస్ పిల్లి పనైపోయిందన్న లోకేష్...
పోలీసులు మైక్ లాక్కోవడంతో అక్కడి ప్రజలను సైలెంట్‌గా ఉండమంటూ లోకేష్ స్టూల్‌పై నిలబడి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘వైఎస్, జగన్ పాదయాత్రలని మేము ఏనాడూ అడ్డుకోలేదు. నేను టెర్రరిస్టు కాదు ఎందుకు అడ్డుకుంటున్నారు. నేను దేశాన్ని దొబ్బి జైలుకి వెళ్ళలేదు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాడటానికి ప్రజల్లోకి వచ్చాను’’ అని చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గంలో అభివృద్ది నిల్లు... అవినీతి ఫుల్లు అని వ్యాఖ్యలు చేశారు.
‘‘నా మైక్ లాక్కోవడానికి వస్తున్న 1000 పోలీసులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అడ్డుకోవాలి. ప్యాలస్ పిల్లి పనైపోయింది. నన్ను అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసులు, 6 డీఎస్పీలు.... ఆఖరికి మహిళలకు రక్షణ కల్పించాల్సిన దిశా డీఎస్పీ కూడా నా వెంట తిరుగుతున్నాడు. పోలీసు అధికారి రఘురామి రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. గతంలో ఐఎఎస్‌లను మాత్రమే జైలుకి తీసుకెళ్ళాడు జగన్ ... ఇప్పుడు ఐపీఎస్‌లను కూడా జైలుకి తీసుకుపోతాడు. భయం నా బయోడేటాలో లేదు. నాది ధర్మ యుద్ధం. మహిళలు, యువత, రైతులకు జగన్ చేసిన అన్యాయాలపై నా పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు.
నీ జీవో 1ను మడిచి.....
ఎస్ ఆర్ పురంలో ఒక సామాన్య వ్యక్తి కి 6 వేల కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. కరెంట్ బిల్లు పెంచేది జగనే... బిల్లు ఎక్కువొచ్చిందని సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిది జగనే అని అన్నారు. 6 లక్షల పెన్షన్ కట్ చేశారని మండిపడ్డారు. జగన్ లాంటి పిరికి ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ ఉండరన్నారు. పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చెయ్యడం ఆపి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చెయ్యాలని హితవుపలికారు. వైసీపీ వాళ్ళకి అమలు కానీ జీఓ 1 ఒక్క లోకేష్ కే ఎందుకు అమలు అవుతుందని ప్రశ్నించారు. ‘‘నీ జీఓ 1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో జగన్ రెడ్డి’’ అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.