YuvaGalamPadayatra: లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ఆరో రోజు ప్రారంభం
ABN , First Publish Date - 2023-02-01T09:13:54+05:30 IST
టీడీపీ నేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది.
చిత్తూరు: టీడీపీ నేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalamPadayatra) ఆరో రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి క్యాంప్ ప్రాంతం నుంచి యాత్ర (LokeshPadayatra)మొదలైంది. లోకేష్ పాదయాత్రకు భారీగా ప్రజాదరణ లభిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎదురొచ్చి మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. పెద్దసంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. అభిమాన నేతతో కలిసి పార్టీ శ్రేణులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రజల్లో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని లోకేష్ అన్నారు. సైకో పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. గత రాత్రి పాదయాత్ర ముగిసిన తర్వాత బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో సమీపంలో వైసీపీ, టీడీపీ బ్యానర్ల కాల్చివేతపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేలుపల్లి క్రాస్ వద్ద వాల్మీకి కులస్తులతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. కొలమాసనపల్లి వద్ద మహిళలతో సమావేశం అవనున్నారు. అలాగే గొల్లపల్లి వద్ద ఎస్సీలతో లోకేష్ (YuvaGalamPadayatra) ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాత్రి రామాపురం ఎమ్మోస్ హాస్పటల్ దగ్గర లోకేష్ (Lokesh Padayatra) బస చేయనున్నారు.
కాగా... జనవరి 27 నుంచి కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర 400 రోజుల పాటు సాగనుంది. మొత్తం 4000 వేల కిలోమీటర్ల మేర లోకేష్(NaraLokeshForPeople) పాదయాత్రగా నడువనున్నారు. పాదయాత్రలో పలువురు రైతులను, విద్యార్థులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వంపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను తీరుస్తామంటూ లోకేష్ (NaraLokesh) హామీ ఇస్తున్నారు. మరోవైపు ప్రతీరోజు అనుకున్న ప్రకారం 10 కిలోమీటర్ల కంటే రెండు మూడు కిలోమీటర్లు ఎక్కువగానే లోకేష్ పాదయాత్రగా వెళ్తున్నారు. పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనతో ప్రజల విన్నపం మేరకు కిలోమీటర్లను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.