YCP: విందు రాజకీయాలకు తెరలేపిన వైసీపీ
ABN , First Publish Date - 2023-10-01T21:31:19+05:30 IST
బహిరంగంగా ప్రలోభాలకు వైసీపీ నేతలు(YCP Leaders) శ్రీకారం చుట్టారు. కార్యకర్తలకు బహిరంగంగా వైసీపీ నేతలు కార్యకర్తలకు మందు పార్టీలు ఇస్తున్నారు. చంద్రగిరి (Chandragiri)లో చేసే ప్రతి ప్రయోగాన్ని వైసీపీ నేతలు రాష్ట్రంలో అమలుచేస్తున్నారు.
తిరుపతి: విందు రాజకీయాలకు వైసీపీ పార్టీ(YCP party) తెరలేపింది. బహిరంగంగా ప్రలోభాలకు వైసీపీ నేతలు(YCP Leaders) శ్రీకారం చుట్టారు. కార్యకర్తలకు బహిరంగంగా వైసీపీ నేతలు కార్యకర్తలకు మందు పార్టీలు ఇస్తున్నారు. చంద్రగిరి (Chandragiri)లో చేసే ప్రతి ప్రయోగాన్ని వైసీపీ నేతలు రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. వార్డు వలంటీర్లు, ఆరోగ్య పరీక్షల వరకు.. ప్రతిదీ మొదట చంద్రగిరిలో ప్రయోగం చేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు అమలుచేస్తున్నారు.ఓ ఫంక్షన్ హాలులో కార్యకర్తలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(MLA Chevireddy Bhaskara Reddy) విందు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని ఆయా నియోజకవర్గంలో గ్రామాల నుంచి బస్సుల్లో.. వైసీపీ నేతలను ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతికి తరలించారు. మధ్యాహ్నం విందు తర్వాత ఇప్పుడు మద్యం పార్టీ ఇస్తున్నట్లు సమాచారం. భారీగా ఫంక్షన్ హాలుకి భారీగా మద్యం తరలించారు. రోజుకు 10వేల మంది వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విందు ఇస్తున్నట్లు సమాచారం.