Ambati Rayudu: సీఎం జగన్‌ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు.. వెంట సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్ కుమార్తె..
ABN , First Publish Date - 2023-06-08T18:46:20+05:30 IST
ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని, ఆయనకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.
ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని, ఆయనకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు (Management representatives), క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) సమావేశమయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ టీంను సీఎం జగన్ అభినందించారు.
ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఇటీవల ఐపీఎల్ ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ట్రోఫీని ముఖ్యమంత్రి జగన్‌కు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్. శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు చూపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. సీఎస్‌కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి రూపా గురునాథ్, అంబటి రాయుడు బహుకరించారు.
కాగా.. సెకండ్ ఇన్నింగ్స్‌గా అంబటి రాజకీయాల్లోకి (Ambati Rayudu Politics) రావాలని తహతహలాడుతున్నారని తెలుస్తోంది. రాయుడు కోసం ఏపీ, తెలంగాణలోని (AP, Telangana) అధికార, ప్రతిపక్షాలు క్యూ కడుతున్నాయని సమాచారం. తమ పార్టీలోకి రండి.. కాదు కాదు తమ పార్టీలోకే రండి అని ఆహ్వానాలు పంపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడితో సమావేశం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.