Devineni Uma: ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు
ABN , First Publish Date - 2023-09-20T19:27:28+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.
"ఈ సైకో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేయించి 11 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలుపాలు చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. ఎన్ని పీటి వారెంట్లు ఇచ్చినా.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. వేల కోట్ల టర్నోవర్ గల ఐటి కంపెనీల సీఈవోలు సైతం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసన తెలుపుతున్నారు. ఫైబర్ నెట్ తో నెలకు రూ. 35 కోట్ల చొప్పున 51 నెలల్లో రూ.1785 కోట్లు జగన్ రెడ్డి వసూలు చేసుకున్నారు. అర్హత లేని ముఖ్యమంత్రి బంధువులను చైర్మన్ గా పెట్టుకొని తప్పుడు ప్రకటన ఇప్పించి బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్‌ను కూడా అరెస్టు చేయాలని చూస్తున్నారు. పిల్ల సైకో సజ్జల డబ్బులు లెక్కేస్తుంటే.. కొడుకు భార్గవ్ సోషల్ మీడియాలో దుర్మార్గపురాతలు రాస్తున్నాడు. శ్రీలంక అధ్యక్షున్ని ఎలా తరిమికొట్టారో ఈ సైకో ముఖ్యమంత్రికి సైతం అదే గతి పడుతుంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా నిన్ను నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు."అని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.