Share News

Atchannaidu: యువ వైద్యుడి ఆత్మహత్యకు జగన్ రెడ్డిదే బాధ్యత..

ABN , First Publish Date - 2023-11-27T13:11:29+05:30 IST

అమరావతి: కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్ (33) ఆత్మహత్యకు సీఎం జగన్ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైద్యుడి తల్లికి వైసీపీ గూండాలు బెదిరించడం దుర్మార్గమన్నారు.

Atchannaidu: యువ వైద్యుడి ఆత్మహత్యకు జగన్ రెడ్డిదే బాధ్యత..

అమరావతి: కాకినాడ (Kakinada)లో యువ వైద్యుడు శ్రీ కిరణ్ (Sri Kiran) (33) ఆత్మహత్య (Suicide)కు సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy)దే బాధ్యతని, వైసీపీ నేతల (YCP Leaders) భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వైద్యుడి తల్లికి వైసీపీ గూండాలు బెదిరించడం దుర్మార్గమని, కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్యపై ఏం సమాధానం చెప్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

భూ కబ్జాలు చేయడం, దోచుకుని దాచుకోవడంలో జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు ఎంతకైనా బరితెగిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శ్రీ కిరణ్ నుంచి భూమి కొనుగోలు చేసిన మాజీ మంత్రి కన్నబాబు సోదరుడు కల్యాణ్ కృష్ణ, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేక కిరణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై ఫిర్యాదు చేసిన డాక్టర్ తల్లిపై వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమన్నారు. వైసీపీ నేతల భూ దాహానికి ఇంకెంతమంది బలికావాలని మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కన్నబాబు స్పందించాలన్నారు. భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని, కన్నబాబు సోదరుడు, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

వివరాలు... వైసీపీ నేతల భూ బెదిరింపులతో కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్ (33) ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందుతోపాటు స్లీపింగ్ పిల్స్ మింగారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మాజీ మంత్రి కన్నబాబు తమ్ముడు కళ్యాణ్, ఆయన అనుచరులు బెదిరించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నబాబు తమ్ముడుకు వైద్యుడు శ్రీ కిరణ్ చెందుర్తి ప్రాంతంలో 6 ఎకరాల భూమి అమ్మారు. దీనికి సంబంధించి రూ. 25 లక్షలు ఇవ్వకుండా కన్నబాబు సోదరుడి అనుచరులు బెదిరింపులకు దిగారు. మరో ఎకరానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారు. కొన్ని రోజులుగా మాజీ మంత్రి కన్నబాబు తమ్ముడు అనుచరులతో డబ్బులు.. డాక్యుమెంట్లు కోసం కిరణ్ సంప్రదింపులు జరిపారు. అయినా ఇవ్వకుండా వేదిస్తుండడంతో మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Updated Date - 2023-11-27T13:12:07+05:30 IST