Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌ కన్నీటి పర్యంతం! ఎందుకంటే..!

ABN , First Publish Date - 2023-06-17T17:50:42+05:30 IST

ఓ తల్లి తన దివ్యాంగుడైన కొడుకును తీసుకొచ్చి వారి సమస్యను పవన్‌కు ఏకరువు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం తమ పెన్షన్ తీసేసి వేధిస్తోందని పవన్‌కు ఆమె మొర పెట్టుకుంది. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని పింఛన్ కట్ చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పరిణామంతో

Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌ కన్నీటి పర్యంతం! ఎందుకంటే..!

కాకినాడ: ఓ దివ్యాంగుడి ఆక్రందనకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) చలించిపోయారు. దీంతో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సంఘటనకు కాకినాడ వేదికైంది. వారాహి యాత్రలో భాగంగా జనసేనాని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కాకినాడలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ తల్లి తన దివ్యాంగుడైన కొడుకును తీసుకొచ్చి వారి సమస్యను పవన్‌కు ఏకరువు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం (YCP Government) తమ పెన్షన్ తీసేసి వేధిస్తోందని పవన్‌కు ఆమె మొర పెట్టుకుంది. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని పింఛన్ కట్ చేశారని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పరిణామంతో పవన్ కూడా చలించి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంది. దీంతో పవన్.. ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాచారు. అన్ని విధిలా ఆదుకుంటానని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు.

p1.gif

Updated Date - 2023-06-17T17:50:42+05:30 IST