AP News: ఏపీలో దళిత యువకుడిపై ఖాకీల దౌర్జన్యం.. ఆస్పత్రిలో చికిత్స
ABN , First Publish Date - 2023-08-19T17:40:26+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. విచారణ పేరుతో దళిత యువకుడ్ని చిత్ర హింసలకు గురిచేశారంటూ కడియం పోలీసులపై కుటుంబ సభ్యులు ఆరోపించారు. చాగల్లు మండలానికి చెందిన వడ్డి వెంకటప్రసాద్‌ను
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. విచారణ పేరుతో దళిత యువకుడ్ని చిత్ర హింసలకు గురిచేశారంటూ కడియం పోలీసులపై కుటుంబ సభ్యులు ఆరోపించారు. చాగల్లు మండలానికి చెందిన వడ్డి వెంకటప్రసాద్‌ను కడియం ఎస్ఐ శివాజీ, మరికొంత మంది పోలీసులు కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పెట్టిన చిత్ర హింసలకు గాయపడడంతో దళిత యువకుడు రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ శివాజీ తనను తీవ్రంగా కొట్టాడని బాధితుడు వెంకటప్రసాద్ ఆరోపించాడు. బాధిత దళిత యువకుడ్ని ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు పరామర్శించారు. దళిత యువకుడిని పోలీస్ స్టేషన్‌లో తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన కడియం ఎస్ఐ శివాజీతో పాటు మిగిలిన పోలీసులును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు.