AP TDP: స్కిల్ డెవలప్‌మెంట్‌పై కీలక విషయాలు బయటపెట్టిన టీడీపీ
ABN , First Publish Date - 2023-09-15T14:45:01+05:30 IST
చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని ఉద్దేశ్యంతో వెబ్‌సైట్ ఓపెన్ చేశాం. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచాం. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైంది. కార్యక్రమం బాగా
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (skill development case) ఎలాంటి అక్రమాలు జరగలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె్న్నాయుడు (Kinjarapu Atchannaidu) తెలిపారు. apskilldevelopmenttruth.com వెబ్‌సైట్‌ను టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, నిమ్మల రామానాయుడు, ఇతర నేతలు ప్రారంభించారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని ఉద్దేశ్యంతో వెబ్‌సైట్ ఓపెన్ చేశాం. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచాం. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైంది. కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం కూడా అవార్డులు ఇచ్చింది. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు. 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయి.’’ అని పేర్కొన్నారు.
‘‘వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వాస్తవాలు తెలియజేయాలని వెబ్‌సైట్ తీసుకొచ్చాం. చంద్రబాబు అరెస్ట్‌కు (Chandrababu) వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిరసనకు దిగుతున్నారు. రూ.380 కోట్లు అవినీతి జరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచి వైసీపీ పతనం ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్ (jr.ntr) ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలి. ఎవరినీ స్పందించమని మేము అడగం. సంబంధం లేని కేసులో ఇరికించారు. హైదరాబాద్‌లో.. విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారు. రాష్ట్ర విభజన సమయంలో వచ్చినట్లు రోడ్డుపైకి వస్తున్నారు. జనసేన పార్టీతో ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలన్న దానిపై త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జనసేన, టీడీపీ నాయకులు కలిసి ఉమ్మడి పోరాటం చేస్తున్నారు.’’ అని స్పష్టం చేశారు.