Pattabhi: అర్ధరాత్రి కరెంటు తీసేసి కొట్టారు..అయినా రాజీలేని పోరాటం చేస్తా..

ABN , First Publish Date - 2023-03-04T13:09:04+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram) విడుదల

Pattabhi: అర్ధరాత్రి కరెంటు తీసేసి కొట్టారు..అయినా రాజీలేని పోరాటం చేస్తా..

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram) విడుదల అయ్యారు. అనంతరం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీ వర్గాల వ్యక్తికి మద్దతు తెలిపేందుకు గన్నవరం వెళ్లాను. పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‎లో అర్ధరాత్రి కరెంటు తీసేసి నన్ను కొట్టారు. ఇప్పటికీ నాలుగు సార్లు నాపై దాడి జరిగింది. అయినా ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాను. నేను జైల్లో ఉన్నప్పుడు మా కుటుంబానికి..మనోధైర్యం కల్పించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(TDP leader and former CM Chandrababu)’’కు పట్టాభి ధన్యవాదాలు తెలిపారు.

కాగా..టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram)‎కు కోర్టులో ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)నుంచి పట్టాభి విడుదలయ్యారు. పట్టాభికి జిల్లా కోర్టు (court)బెయిల్ మంజూర్ చేసింది. రూ.25వేల చోప్పున పూచీకత్తు ఇవ్వాలనీ కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పట్టాభికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

Updated Date - 2023-03-04T13:19:04+05:30 IST