Drinking Water: ఏపీలో దారుణ పరిస్థితి.. బురద నీరే వాళ్లకు తాగునీరు
ABN , First Publish Date - 2023-07-23T16:03:14+05:30 IST
అల్లూరి జిల్లా ముంచింగ్ పుట్టు మండలం కొడగడు గ్రామంలో గిరిజనులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు కూడా దొరక్క అల్లాడుతున్నారు. దీంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న బురద నీరే వాళ్లకు జీవనాధారంగా మారింది. బురద నీటినే తాగునీరుగా వాడుకోవడం కనిపిస్తోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. గిరిజనులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. వాళ్లను పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముంచింగ్ పుట్టు మండలం కొడగడు గ్రామంలో గిరిజనులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు కూడా దొరక్క అల్లాడుతున్నారు. దీంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న బురద నీరే వాళ్లకు జీవనాధారంగా మారింది. బురద నీటినే తాగునీరుగా వాడుకోవడం కనిపిస్తోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లూరి జిల్లా ముంచింగ్ పుట్టు మండలం కొడగడు గ్రామంలో గిరిజనులు తాగునీటి కోసం బురదనీటిని వాడుకుంటున్నారు. మైళ్ల దూరం నడిచి బిందెలతో బురదనీటిని పట్టుకెళ్తున్నారు. అయితే గిరిజనులు బురదనీరు వాడుకోవడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులకు తమ సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కొడగడు గ్రామస్తులు చేతులెత్తి మొక్కుతున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Roads in AP: ఏపీలో రోడ్ల దుస్థితికి నిలువుటద్దం ఈ ఒక్క ఘటన..!!
కాగా అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో ఎడతెరపి లేని వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శబరి గోదావరి సంగమంలో రెండు నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. వీఆర్ పురం మండలం అన్నవరం వాగు పొంగడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం వద్ద గోదావరి నది, చింతూరు వద్ద శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు కూడా అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇప్పటికే ఏపీలో రోడ్ల దుస్థితిపై ప్రజలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలోని తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఓ యువకుడు బురదనీటితో నిండి ఉన్న రోడ్డుపైనే మంచం వేసుకుని పడుకుని నిరసన తెలిపాడు. అంతేకాకుండా పార్వతీపురం - రాయ్‌గఢ్ జాతీయ రహదారిపై ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీగా గుంతలు ఏర్పడి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో కొమరాడ వద్ద కొందరు యువకులు ఈత కొడుతూ నిరసన వ్యక్తం చేశారు.