Lokesh: గన్నవరంలో హైటెన్షన్ - లోకేష్ పాదయాత్ర రూట్ మార్చిన పోలీసులు
ABN , First Publish Date - 2023-08-21T20:49:39+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Padayatra) గన్నవరంలో కొనసాగుతోంది.
గన్నవరం, విజయవాడ: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh Padayatra) గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్‌ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆఫీస్ ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా.. ఎమ్మెల్యే వంశీ ఆఫీస్‌లో (MLA Vamsi office) ఉండడంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు. తమ రూట్ ప్రకారం తాము వెళ్లాల్సిందేనంటుూ టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వంశీ కార్యాలయంలో ఉన్న కారణంగా వేరే మార్గం గుండా వెళ్లాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం గన్నవరం సమీపంలోని హెచ్‌సీఎల్ వద్ద లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి హెచ్‌సీఎల్ కంపెనీని తానే తెచ్చానంటూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. కాసేపట్లో పోలీసులు దిగ్బంధించిన మార్గం వద్దకు యువగళం పాదయాత్ర చేరుకోనుంది. లోకేష్ పాదయాత్ర కొనసాగే రహదారిపై పోలీసులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సైకో పోవాలి - సైకిల్ రావాలి అంటూ తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున డీజీ ప్లే చేస్తున్నారు.