Lokesh Ganta meet: లోకేష్‌తో గంటా సుదీర్ఘ భేటీ.. అన్నీ వివరించిన గంటా..!
ABN , First Publish Date - 2023-01-10T15:13:33+05:30 IST
టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh)తో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సుమారు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు.
హైదరాబాద్: టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh)తో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సుమారు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు. టీడీపీ (TDP) అధిష్టానం గంటాపై అసంతృప్తిగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు రావాలని అధిష్టానం కోరిన ఆయన హాజరుకాలేదు. పార్టీ సభ్యత్వ విషయంతో పాటూ కమిటీల ఏర్పాటుపై గంటా శ్రద్ధ పెట్టలేదనే ఆరోపణలున్నాయి. పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో ఆయన దూరంగా ఉండడంతో హై కమాండ్ అసంతృప్తిగా ఉంది. ఇటీవల కాపులకు అన్యాయం జరుగుతోందని ఓ వేదికను గంటాతో ఇతర నేతలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచి కాపుల సంక్షేమంపై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు, లోకేష్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ వచ్చిన గంటా.. జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో లోకేష్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది... తదితర అంశాలను లోకేష్‌కు వివరించినట్లు సమాచారం. అయితే గంటాపై టీడీపీ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుంది. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై ఏమిటనేది కూడా తేలాల్సి ఉంది. ఈ రోజు సమావేశంలో కొంత స్పష్టత వచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో గంటా పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
2019 ఎన్నికల తర్వాత పార్టీలో గంటా క్రియాశీలకంగా లేరు. అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలకు ముందునుంచే వైసీపీలో చేరేందుకు గంటా ప్రయత్నాలు కొనసాగించినా, అవి ఫలించలేదు. గంటాకు తరచూ నియోజకవర్గాలను మార్చే అలవాటు కూడా ఉంది. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.