Tulasi Reddy: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తులసిరెడ్డి

ABN , First Publish Date - 2023-09-09T11:39:47+05:30 IST

పీ సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారు జామున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సమర్థనీయం కాదన్నారు. ఈ దుశ్చర్య దురదృష్టకరం, దుర్మార్గం, దౌర్జన్యం అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని

Tulasi Reddy: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తులసిరెడ్డి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను (Chandrababu arrest) ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి (Tulasi Reddy) తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారు జామున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సమర్థనీయం కాదన్నారు. ఈ దుశ్చర్య దురదృష్టకరం, దుర్మార్గం, దౌర్జన్యం అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ (Cm jagan) రాజకీయ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని తెలిపారు. ఇది రాజ్య హింస అన్నారు. ఈ దుశ్చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విషయంలో కానీ.. మణిపూర్ విషయంలో కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (Modi Government) అవలంబించిన విధానాన్ని చంద్రబాబు కానీ, టీడీపీ నాయకులు ఖండించక పోయినప్పటికీ చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-09T11:39:52+05:30 IST