Share News

CBN Arrest: ఫైబర్ నెట్ కేసుపై ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారుల మెమో దాఖలు

ABN , First Publish Date - 2023-10-17T21:24:26+05:30 IST

ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. పీటీ వారెంట్‌పై రేపు టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.

CBN Arrest: ఫైబర్ నెట్ కేసుపై ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారుల మెమో దాఖలు

విజయవాడ: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. పీటీ వారెంట్‌పై రేపు టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. నేడు సుప్రీంకోర్టులో ఫైబర్‌నెట్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో అదే అంశాన్ని సీఐడీ ఏసీబీ కోర్టుకు తెలిపింది.

Updated Date - 2023-10-17T21:31:09+05:30 IST