AP High Court : చిరుత దాడిలో మరణించిన చిన్నారికి టీటీడీ ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోవడంపై హైకోర్ట్ అభ్యతరం
ABN , First Publish Date - 2023-11-29T16:36:14+05:30 IST
తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుంటుంబానికి 5 లక్షలు ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్ట్ ( AP High Court ) అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతి: తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుంటుంబానికి 5 లక్షలు ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్ట్ ( AP High Court ) అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ధనిక ఆలయం ఆయినా డబ్బు చెల్లించక పోవడం ఏమిటని ప్రశ్నించింది. నడకదారిలో ఫెన్సింగ్ వేసేందుకు వైల్డ్ లైఫ్ కార్పొరేషన్ ఆఫిడవిట్‌లో సుముఖత వ్యక్తం చేసింది. అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాసులు ఏర్పాటు చేసేందుకు కూడా అభ్యంతరం లేదని వైల్డ్ లైఫ్ తెలిపింది. వైల్డ్ లైఫ్, టీటీడీ, రాష్ట్ర అటవీ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని పిటీషనర్ తరపు న్యాయవాది యాలమంజుల బాలాజీ కోరింది. హైకోర్ట్ పర్యవేక్షణ అవసరమని బాలాజీ చెప్పింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ, తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.