Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్‌లకు అన్యాయం:

ABN , First Publish Date - 2023-08-05T17:08:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వం(YCP GOVT) లో సర్పంచ్‌ల(Sarpanchs)కు అన్యాయం జరుగుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు.

 Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్‌లకు అన్యాయం:

అమరావతి(Amaravati): వైసీపీ ప్రభుత్వం(YCP GOVT) లో సర్పంచ్‌లకు(Sarpanchs) అన్యాయం జరుగుతోందని జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌లతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌తో సర్పంచ్‌లు తమ గోడును వెళ్లబోసుకున్నారు.


పవన్‌కు సమస్యలు విన్నవించిన సర్పంచ్‌లు

‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నేతల అరాచకాలను ఎదుర్కొని నిలబడ్డాం. ప్రజల మమ్ములను నమ్మి ఆదరించడంతో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యాం. ముప్పై నెలలు అయినా నేటికీ పంచాయతీలకు నిధులు రాని పరిస్థితి. పాలకులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. మా నిధులు మాకు ఇవ్వాలని పోరాటాలు చేశాం. మా మీద కక్ష కట్టి మా పై కేసులు పెట్టి అరెస్టు చేయించారు. 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను సీఎం జగన్ దారి మళ్లించారు. నేడు లక్ష రూపాయల అభివృద్ధి పని కూడా గ్రామాల్లో చేయలేని పరిస్థితి ఉంది. నిధుల కొరత పేరుతో మేము చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. ఇటీవల కేంద్రం 980 కోట్లు పంచాయతీలకు ఇస్తే... వాటిని జగన్ మళ్లించేశారు. ఈ అంశంపై అధికారులను కలిసేందుకు‌ వెళ్తే పోలీసులు ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సర్పంచ్‌లకు జగన్ ఇచ్చే గౌరవం‌ ఇదేనా?. గ్రామాల్లో పనులు జరక్క... కూలీ పనులుకు వెళ్తున్నాం. గ్రామాల అభివృద్ధిని జగన్ పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే ఉద్యమం చేస్తున్నాం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు. పంచాయతీ కార్యాలయం నిర్వహణకు కూడా డబ్బులు లేవు, ఇవ్వరు. కష్టపడి ప్రజల అభిమానంతో గెలిచిన మా దుస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆస్తులు అమ్ముకుని, అప్పులపాలై, ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు’’ అని పవన్ కళ్యాణ్‌కు సర్పంచ్‌లు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

Updated Date - 2023-08-05T17:25:03+05:30 IST