Nadendla Manohar: పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిన వైసీపీ సర్కార్
ABN , First Publish Date - 2023-10-11T12:32:05+05:30 IST
వైసీపీ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
గుంటూరు: వైసీపీ ప్రభుత్వం పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Janasena Leader Nadendla Manohar) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టోపెల్ శిక్షణ పేరిట ఈటీఎస్ సంస్థకు ఏటా రూ.1040 కోట్లు దోచి పెట్టడానికి సిద్ధమైందన్నారు. ఏటా అమెరికా వీసా పొందే తెలుగు విద్యార్థులు 40 వేల మంది మాత్రమే అని.. కానీ ప్రభుత్వం లక్షలాది మందికి శిక్షణ ఇచ్చేది ఎందుకు అని ప్రశ్నించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద వైసీపీ ప్రభుత్వం (YCP Government) కేవలం 340 మందిని మాత్రమే విదేశాలకు పంపించిందని తెలిపారు. నాలుగేళ్లుగా ప్రజల్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా మరోసారి మోసానికి సిద్ధమైందని మండిపడ్డారు సీఎం హెలికాప్టర్లో తిరుగుతూ ఎస్సీ, ఎస్టీ , బీసి నేతలను బస్సుయాత్ర చేయాలని ఆదేశించారన్నారు. బస్సు యాత్రలో జగన్ రెడ్డి (CM Jagan Reddy) కూడా పాల్గొనాలని.. రాష్ట్రం లో రోడ్లు దుస్థితి ప్రత్యక్షంగా చూడాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రతిపక్ష నేతలను విమర్శించడం కోసమే సీఎం పర్యటనలు అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు.