Kanna: జగన్ రెడ్డి సర్కార్ పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం..

ABN , First Publish Date - 2023-04-13T12:47:02+05:30 IST

గుంటూరు జిల్లా: టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు.

Kanna: జగన్ రెడ్డి సర్కార్ పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం..

గుంటూరు జిల్లా: టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సాగర్ కుడి కాలువకు నీటి కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ (Dead line) పెట్టారు. రెండు రోజులలో కుడి కాలువకు నీరు విడుదల చేయాలని.. ప్రభుత్వం స్పందించపోతే సత్తెనపల్లిలో రైతులతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని, సాగర్ కుడి కాలువకు నీరు నిలిపివేతే దీనికి నిదర్శనమన్నారు. చివరి తడికి నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి బాధ్యత లేకుండా ఉన్నారని, స్వంత జిల్లాలో రైతుల గురించి పట్టించుకోవడం లేదని, రైతులపై సీఎం జగన్ రెడ్డి కక్ష కట్టినట్లుగా ఉందని కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-13T12:47:02+05:30 IST