Kanna Goodbye to BJP : బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

ABN , First Publish Date - 2023-02-16T12:19:11+05:30 IST

బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపారు.

Kanna Goodbye to BJP : బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

గుంటూరు: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana resign to bjp) రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda)కు కన్నా రాజీనామా లేఖను పంపారు. అనుచరులతో కలిసి బీజేపీ (BJP)కి కన్నా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు కన్నా వెల్లడించారు. ఈ రోజు ఉదయం తన నివాసంలో ముఖ్య అనుచరులతో కన్నా సమావేశమయ్యారు. ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం కన్నా రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు.

కాగా... కన్నా టీడీపీలో కానీ జనసేన పార్టీలోకి కానీ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏ పార్టీలో చేరేది మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్ని అనుచరులు చెబుతున్నారు. ఇటీవల కన్నా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సోమవారం అమరావతిలో జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పర్యటనలో కూడా కన్నా పాల్గొనలేదు.

Updated Date - 2023-02-16T12:28:39+05:30 IST