Share News

Skill Case : స్కిల్ కేసులో కీలక పరిణామం..

ABN , First Publish Date - 2023-11-06T22:51:57+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న..

Skill Case : స్కిల్ కేసులో కీలక పరిణామం..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న ఘంటా వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌కి.. ముందస్తు బెయిల్ కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు- 23న ఘంటా ప్రసాద్‌కి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ బెయిల్‌ను కొనసాగించడం జరిగింది. గతంలో ఇచ్చిన విధించిన షరతులే కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రసాద్ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నందున ముందస్తు బెయిల్ కొనసాగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

Updated Date - 2023-11-06T22:52:12+05:30 IST